గీత రచన: రావు తల్లాప్రగడ

సంగీతం: సాయి మానాప్రగడ

ఈ గీతం వినడానికి:  
          (బటన్ నొక్కాక పాట వినడానికి అవసరమైతే కొంచెం వేచి ఉండగలరు)                                   

 

ఇటీవల సిలికానాంధ్ర నిర్వహించిన ఆంధ్రసాంస్కృతికోత్సవంలో ప్రియభారతం అనే నృత్యరూపకంలో, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, వారి బాణీలపై తెలుగులో పాటలు కట్టి, వాటికి నృత్యరూపకలపన జరిపి, ప్రదర్శించడం జరిగింది. ఆ సంధర్భంగా ఈ పాటల ఛ్డ్ని కూడా విడుదలచేయడం జరిగింది. ఇందులో ఒక పాట ఈ మాసం మీ ముందుకు తెస్తున్నాము.

మళయాళం పాట

పల్లవి)

సింధురం సుందర బంధం- రుధిరం మధుర బంధం; -

మళయాలం మలయ మారుతం- హరితం అందున ఓణం (2)

సుగంధ పరిమ ళాలొలికె శ్రీగంధ ముకుంద మై - 

గంధర్వ సుగర్వ సంగీతం సాగే సర్వత్రం (2)

దురాచారం, దురవగాహం, దురభిమానం, చాలా దూరం

మళయాలం మలయ మారుతం – హరితం అందున ఓణం!

చరణం 1)

తాండవం విరంగతరంగ ,  మృదంగ ఉత్తుంగ , అనంత జంగం

ఆనందం సునందచందాన  మందారపందాన   పాదారవిందం

సింధురం సుందర బంధం- రుధిరం మధుర బంధం;

మళయాలం మలయ మారుతం - హరితం అందున ఓణం

చరణం 2)

వామనం చిన్నారిపాదాల త్రివిక్రమార్కాల, పుణ్యాతి పుణ్యం

బాలునీ బలానబలైన  బలొక్కదానం బలీయ కావ్యం!

సింధురం సుందర బంధం- రుధిరం మధుర బంధం;

మళయాలం మలయ మారుతం- హరితం అందున ఓణం

చరణం 3)

వానయే వనాలప్రాణం, పైవాడిబాణం వింతైన కోణం

పంటలే పొలానపండంగ నట్టింటనాట్యం మత్తైన ఓణం!

సింధురం సుందర బంధం- రుధిరం మధుర బంధం;

మళయాలం మలయ మారుతం- హరితం అందున ఓణం

 

 

 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech