1-844-626-BADI(2234)
Twitter
Youtube

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కూచిపూడి కి మరో గిన్నిస్ రికార్డ్

విజయవాడలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో సిలికానాంధ్ర 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం లో 18 దేశాలకు చెందిన 6117 మంది కళాకారుల మహా బృంద నాట్యం – గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ సొంతం చేసుకుంది.

మహాబృంద నాట్య ప్రదర్శన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, సిలికానాంధ్ర సంస్థాపక అద్యక్షులు ఆనంద్ కుచిభొట్ల లకు గిన్నిస్ బుక్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు గిన్నిస్‌ బుక్‌ రికార్డు ప్రతనిథులు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రులు కామినేని, దేవినేని లతోపాటు కూచిపూడి గురువులు,సిలికానాంధ్ర ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల, ఫణిమాధవ్ కస్తూరి, అమెరికా ప్రముఖులు డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.